సమ్మె విరమించనున్న సెర్ప్‌ ఉద్యోగులు | SERP employees Pause strike | Sakshi
Sakshi News home page

సమ్మె విరమించనున్న సెర్ప్‌ ఉద్యోగులు

Dec 3 2017 1:46 AM | Updated on Dec 3 2017 1:46 AM

SERP employees Pause strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెర్ప్‌ ఉద్యోగుల సమ్మె విరమణకు సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శనివారం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంట్లో మంత్రితోపాటు ఎంపీ కవితతో సెర్ప్‌ ఉద్యోగ సంఘం ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారు. ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిలో ఉన్నాయని, సరైన సమయంలో ఆయన నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరడంతో వారు సానుకూలంగా స్పందించి విరమిస్తామని చెప్పినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement