సీమాంధ్ర ఏజెంటు జగ్గారెడ్డి | Seemandhra agent Jagga reddy | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఏజెంటు జగ్గారెడ్డి

Sep 2 2014 2:17 AM | Updated on Oct 9 2018 5:54 PM

సీమాంధ్ర ఏజెంటు జగ్గారెడ్డి - Sakshi

సీమాంధ్ర ఏజెంటు జగ్గారెడ్డి

సీమాంధ్ర పాలకులు చంద్రబాబునాయడు, వెంకయ్యనాయుడుల ఏజెంటుగా వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిని ఓడించాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పిలుపునిచ్చారు.

డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
పటాన్‌చెరు రూరల్:  సీమాంధ్ర పాలకులు చంద్రబాబునాయడు, వెంకయ్యనాయుడుల ఏజెంటుగా వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిని ఓడించాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పాటి చౌరస్తాలోని  ఎస్వీఆర్ గార్డెన్‌లో టీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ద్రోహి అయిన జగ్గారెడ్డిని మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించాలన్నారు.

తెలంగాణలో ఉద్యమాలు నడుస్తుంటే అడ్డుకున్న జగ్గారెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారన్నారు.  ఎమ్మెల్యేలు, బాబూమోహన్, గ్యాదరి కిశోర్,  ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, భాను ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు.  చాగన్ల నరేంద్రనాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు జిల్లా ప్రజలకు చేసిందేమీలేదన్నారు. అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పటాన్‌చెరు వరకు మెట్రో రైలు, సంగారెడ్డి వరకు ఎంఎంటీఎస్  తీసుకవ స్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement