రెండోరోజు ‘జెడ్పీటీసీ’కి 154 నామినేషన్లు  | second day ZPTC has 154 Nominations | Sakshi
Sakshi News home page

రెండోరోజు ‘జెడ్పీటీసీ’కి 154 నామినేషన్లు 

Apr 24 2019 4:33 AM | Updated on Apr 24 2019 4:33 AM

second day ZPTC has 154 Nominations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తొలివిడత పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఎంపీటీసీ స్థానాలకు 1,278, జెడ్పీటీసీ స్థానాలకు 154 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారంతో మొదటి దశ ఎన్నికల నామినేషన్ల సమర్పణ ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల దాఖలు మొదలైన సోమవారం జెడ్పీటీసీలకు 91, ఎంపీటీసీలకు 665 నామినేషన్‌ పత్రాలను సమర్పించిన విష యం తెలిసిందే. మే 6న జరగనున్న మొదటి విడత ఎన్నికల్లో 195 మండలాల్లోని 197 జెడ్పీటీసీ సీట్లకు, 2,166 ఎంపీటీసీ సీట్లకు అభ్యర్థులు పోటీపడుతున్నారు.

మంగళవారం 1,248 మం ది ఎంపీటీసీ అభ్యర్థులు, 1,278 నామినేషన్లు, 147 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 154 నామినేషన్లు సమర్పించారు. సంగారెడ్డి జిల్లాలో 9 జెడ్పీటీసీ స్థానాలకు 15మంది అభ్యర్థులు 16 నామినేషన్లు, నల్లగొండ జిల్లాలో 10 స్థానాలకు 11 మంది 11 నామినేషన్లు, పెద్దపల్లిలో 7 స్థానాలకు 9 మంది, 10 నామినేషన్లు దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని 9 మండలాల్లోని 103 ఎంపీటీసీ స్థానాలకు 135 మంది అభ్యర్థులు 138 నామినేషన్లు, నల్లగొండ జిల్లా 10 మండలాల్లోని 109 ఎంపీటీసీలకు 96 అభ్యర్థులు, 97 నామినేషన్లు వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement