విజ్ఞాన యాత్రలో అపశృతి | School bus hits lorry in medchal | Sakshi
Sakshi News home page

విజ్ఞాన యాత్రలో అపశృతి

Dec 10 2017 5:23 PM | Updated on Aug 30 2018 4:17 PM

School bus hits lorry in medchal - Sakshi

సాక్షి, సిరిసిల్ల:
విజ్ఞాన యాత్రకు వెళ్తున్న పాఠశాల బస్సు, హైవేపై యూటర్న్‌ తీసుకుంటున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలవ్వగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్రలో భాగంగా హైదరాబాద్‌కు బయలుదేరారు.

తుర్కపల్లిలోని చౌరస్తా వద్ద వెనకవైపు నుంచి వస్తున్న వ్యానును గమనించకుండానే లారీ డ్రైవర్‌ యూటర్న్ తీసుకున్నాడు. దీంతో విద్యార్థులున్న వ్యాను, లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పాడైంది. ముందు భాగంలోని అద్దం పగిలి, గ్లాస్‌ పెంకులు విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది విద్యార్థులకు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వీరిని మేడ్చల్‌లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement