త్యాగాల తెలంగాణను కాపాడుకుందాం  | Save Telangana State In TRS Party Ruling | Sakshi
Sakshi News home page

త్యాగాల తెలంగాణను కాపాడుకుందాం 

Apr 8 2019 3:30 PM | Updated on Apr 8 2019 3:31 PM

Save Telangana State In TRS Party Ruling - Sakshi

ధర్పల్లి కాంగ్రెస్‌ రోడ్‌ షోలో మాట్లాడుతున్న ప్రజా గాయకుడు గద్దర్‌

ధర్పల్లి: కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ కృషితో వచ్చిన త్యాగాల తెలంగాణను కాపాడుకుందామని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. ధర్పల్లి గాంధీచౌక్‌లో ఆదివారం రాత్రి నిజామాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కిగౌడ్‌కు మద్దతుగా ఎన్నికల రోడ్‌ షోలో గద్దర్‌ పాల్గొని మాట్లాడారు. ఎందరో తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి ఆశయాలను నిలబెట్టుకోవాలన్నారు. పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కిగౌడ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు. తాను పదేళ్లు ఎంపీగా జిల్లాకు ఎంతో అభివృద్ధి చేశానన్నారు. తెలంగాణ సాధన కోసం పార్లమెంట్‌లో గళం విప్పి సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ తెప్పించానని అన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీని బపరిచి రాహుల్‌గాంధీని ప్రధాని చేసుకుంటేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ కర్క గంగారెడ్డి, నాయకులు లాలాగౌడ్, రమేశ్‌గౌడ్, బాలనర్సయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement