కేసీఆర్ అండతో మరిన్ని విజయాలు: సానియా | sania mirza receive rs 1 crore cheque from kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ అండతో మరిన్ని విజయాలు: సానియా

Sep 11 2014 2:40 PM | Updated on Aug 24 2018 5:21 PM

కేసీఆర్ అండతో మరిన్ని విజయాలు: సానియా - Sakshi

కేసీఆర్ అండతో మరిన్ని విజయాలు: సానియా

ప్రపంచంలో తెలంగాణను ఉన్నత స్థానంలో ఉంచేందుకు ప్రయత్నించానని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు.

హైదరాబాద్ :  ప్రపంచంలో తెలంగాణను ఉన్నత స్థానంలో ఉంచేందుకు ప్రయత్నించానని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. ఆమె గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్డ్ టైటిల్ గెలిచినందుకు సానియాకు ఈ సందర్భంగా కేసీఆర్ రూ.కోటి చెక్ అందించి, తెలంగాణ ఇమేజ్ను పెంచినందుకు అభినందనలు తెలిపారు.

భేటీ అనంతరం సానియా మాట్లాడుతూ కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు కేసీఆర్ ఇస్తున్న అభినందనీయమన్నారు. ఇదే ప్రోత్సాహంతో మరిన్ని విజయాలు సాధిస్తానని సానియ తెలిపారు. యూఎస్ ఓపెన్ విజయంతో తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపానని కేసీఆర్ అభినందించారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సహం మరువలేనిదని, మరిన్ని విజయాలు సాధిస్తానని సానియా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement