సంఘమిత్ర ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం | sanghamitra express near misses fire accident | Sakshi
Sakshi News home page

సంఘమిత్ర ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం

Oct 20 2014 7:25 AM | Updated on Sep 5 2018 9:45 PM

పాట్నా నుంచి బెంగళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం త్రుటిలో తప్పింది.

పాట్నా నుంచి బెంగళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్యాంట్రీ కారు బ్రేకుల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడ పొగలు దట్టంగా అలముకున్నాయి. అయితే దాన్ని సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెద్దప్రమాదమే తప్పింది. వెంటనే రైలును వరంగల్ స్టేషన్లో నిలిపివేశారు.

బీహార్ రాజధాని పాట్నా నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్తున్న ఈ రైలును వరంగల్ స్టేషన్లో క్షుణ్ణంగా పరిశీలించి, తగిన మరమ్మతులు చేసి ఆ తర్వాత మళ్లీ బెంగళూరుకు పంపుతారని రైల్వే వర్గాలు తెలిపాయి. సమయానికి పొగను గమనించి ఆపేయడంతో భారీ ప్రమాదమే తప్పిందని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement