చర్లపల్లికి చేరిన సంగీత పంచాయితీ | Sangeetha 6th Day Deeksha in front of in- law's house | Sakshi
Sakshi News home page

చర్లపల్లికి చేరిన సంగీత పంచాయితీ

Nov 24 2017 1:53 PM | Updated on Nov 25 2017 9:08 AM

Sangeetha 6th Day Deeksha in front of in- law's house - Sakshi - Sakshi

టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆయన రెండో భార్య సంగీతల పంచాయితీ చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు చేరింది.

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆయన రెండో భార్య సంగీతల పంచాయితీ చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు చేరింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట ఆరు రోజులుగా సంగీత నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విదితమే.

దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగారు. చర్లపల్లి జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని బోడుప్పల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు కలిసి రాజీ కుదుర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సంగీతకు ఎంతో కొంత డబ్బు చెల్లించి వదిలించుకోవాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ నేతల రాకతో జైలు ప్రాంతం సందడిగా మారింది.

కాగా ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజీ కుదిర్చేందుకు వ‌చ్చిన సామాజికవేత్తల, రాజ‌కీయ నాయ‌కుల‌ ప్రయత్నాలను కొంతమంది మహిళా కార్యకర్తలు ముందుకు సాగనివ్వడంలేదు. సంగీత కోరుతున్న ష‌రతుల‌కు మామ బాల్‌రెడ్డిని ఒప్పించి దీక్ష విర‌వింపజేసేలా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement