టీ కేబినెట్‌లో సమైక్యవాద చాంపియన్లు | samaikya vada champions in telangana cabinet | Sakshi
Sakshi News home page

టీ కేబినెట్‌లో సమైక్యవాద చాంపియన్లు

Dec 17 2014 3:28 AM | Updated on Aug 11 2018 6:56 PM

టీ కేబినెట్‌లో సమైక్యవాద చాంపియన్లు - Sakshi

టీ కేబినెట్‌లో సమైక్యవాద చాంపియన్లు

తెలంగాణ కేబినెట్ చూస్తే రాష్ర్టంలో టీడీపీ అధికారంలో ఉన్నట్టు కన్పిస్తోందని, సమైక్యవాద చాంపియన్స్‌గా చెప్పుకున్నవారంతా ఇప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.

* టీటీడీపీ నేత పెద్దిరెడ్డి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ చూస్తే రాష్ర్టంలో టీడీపీ అధికారంలో ఉన్నట్టు కన్పిస్తోందని, సమైక్యవాద చాంపియన్స్‌గా చెప్పుకున్నవారంతా ఇప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీని బలహీనపరిచేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయోగాలు వృథాప్రయాసేనని అన్నా రు.

ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఊటబావి వంటిదని, ఎప్పటికీ ఖాళీ కాదని అన్నారు. టీడీపీలో ఉన్నవారంతా ద్రోహులే అని మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని, నిన్నటి దాకా ద్రోహులు అని తిట్టిన వారినే ఆయన కేబినెట్‌లో చేర్చుకున్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement