సిఎంఓ ముఖ్యకార్యదర్శిగా ఎస్.నర్సింగరావు | S.Narsing Rao as CMO Chief Secretary | Sakshi
Sakshi News home page

సిఎంఓ ముఖ్యకార్యదర్శిగా ఎస్.నర్సింగరావు

Jun 26 2014 5:12 PM | Updated on Sep 2 2017 9:26 AM

ఎస్.నర్సింగరావు

ఎస్.నర్సింగరావు

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సిఎంఓ) ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగరావు బాధ్యతలు చేపట్టారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సిఎంఓ) ముఖ్య కార్యదర్శిగా  సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగరావు బాధ్యతలు చేపట్టారు. 1986 ఆంధ్ర ప్రదేశ్ బ్యాచ్కు చెందిన నర్సింగ రావు గతంలో సింగరేణి కాలరీస్ కంపెనీకి చైర్మన్గా  ఉన్నారు.  ఆ తరువాత ఆయన కోల్‌ ఇండియా సీఎండీగా ఉండేవారు. ప్రస్తుతం ఆయనను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేశారు. దాంతో  ఆయనను సిఎంఓ ముఖ్యకార్యదర్శిగా నియమించారు.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఏ.బాబును హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఎం.జగన్మోహన్ను నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement