ఆగస్టు 15న రైతు బీమా సర్టిఫికెట్లు

Rythu Bheema certificates are on August 15th - Sakshi

ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌.కె.జోషి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న రైతు బీమా పథకంలో ఇప్పటివరకు 26.38 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి తెలిపారు. రైతుబీమా, బిందు సేద్యం, భూ రికార్డుల ప్రక్షాళన, కంటి వెలుగు, హరితహారం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కార్యక్రమాలపై సీఎస్‌ మంగళవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  

- రైతు బంధు చెక్కులు పొందిన రైతులందరినీ సంప్రదించి అర్హులైన రైతులను బీమా పథకంలో చేర్చాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి సూచించారు. 48.26 లక్షల మంది రైతు బంధు చెక్కులు పొందా రని, ఇప్పటివరకు 40.64 లక్షల మందిని సం ప్రదించామని, అర్హుల ను సంప్రదించి ఆగస్టు 1 నాటికి వీరి వివరాలను ఎల్‌ఐసీ వారికి సమర్పిస్తే గుర్తింపు సంఖ్య, సర్టిఫికెట్లు ముద్రిస్తారని అన్నారు. రైతు బీమాలో చేరేందుకు ఆసక్తి చూపని వారి వివరాలు నమోదు చేయాలన్నా రు. ఆగస్టు 15న సీఎం కేసీఆర్‌ రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల్లో రైతులకు బీమా   సర్టిఫికెట్లు అందించాలన్నారు.  

భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఆరు లక్షల డిజిటల్‌ సంతకాలు పూర్తయ్యాయని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన∙కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 4.5 లక్షలు, మండల స్థాయిలో 1.5 లక్షల పాసుపుస్తకాలను ముద్రించాల్సి ఉందని ఈ ప్రక్రియను వేగిరం చేయాలన్నారు.  మిగతా పాసుపుస్తకాల డిజిటల్‌ సంతకాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 

కంటివెలుగు కార్యక్రమాన్ని కేసీఆర్‌ ఆగస్టు 15న గజ్వేల్‌లో ప్రారంభిస్తారని.. అన్ని జిల్లా ల్లో అమలుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి అన్నారు. జిల్లా స్థాయిలో మెడికల్‌ అధికారులు, ఆప్టిమెట్రీషియన్లతో బృం దాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.  

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులు మండల, ఆర్డీవో స్థాయిలో పెండింగ్‌లో ఉం టున్నాయని, వీటిపై కలెక్టర్లు సమీక్షించాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం అన్నారు. పెళ్లి నాటికి ఆర్థిక సాయం అందించాలనే సీఎం ఆదేశాలను అమలు చేసేందుకు నిధుల కొరత లేదని, మంజూరు పత్రాలను వేగంగా అందజేయాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top