ఆర్టీసీ ర్యాలీలో విషాదం | RTC Driver Died In Hyderabad | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ర్యాలీలో విషాదం

Oct 10 2019 7:07 PM | Updated on Oct 10 2019 9:34 PM

RTC Driver Died In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. సమ్మెలో పాల్గొన్న ఓ ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటులో మృతి చెందారు. చెంగిచర్ల డిపోకు చెందిన డి. కొమురయ్య అనే డ్రైవర్‌ గురువారం ఆర్టీసీ జేఏసి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. మార్గమధ్యలో గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. గమనించిన తోటి కార్మికులు హుటాహుటిన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అతను మృతి చెందాడని వెల్లడించారు. తమ సహచరుడి అకస్మిక మరణంపట్ల ఆర్టీసీ కార్మికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement