డీసీఎం, ఆర్టీసీ బస్సు ఢీ | RTC Bus and DCM collided at nalgonda district | Sakshi
Sakshi News home page

డీసీఎం, ఆర్టీసీ బస్సు ఢీ

Apr 25 2016 10:40 AM | Updated on Aug 29 2018 4:18 PM

డీసీఎం, ఆర్టీసీ బస్సు ఢీ - Sakshi

డీసీఎం, ఆర్టీసీ బస్సు ఢీ

నల్లగొండ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో రాంగ్‌రూట్‌లో వెళ్తున్న ట్రాక్టర్, ఎదురుగా విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎంను ఢీకొంది.

చిట్యాల: నల్లగొండ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో రాంగ్‌రూట్‌లో వెళ్తున్న ట్రాక్టర్, ఎదురుగా విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎంను ఢీకొంది.

దీంతో డీసీఎం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దానిని ఆ వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం కారణంగా జాతీయరహదారిపై గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు

Advertisement
 
Advertisement
Advertisement