పామును మింగిన కోడిపుంజు.. | Rooster stupid swallows snake | Sakshi
Sakshi News home page

పామును మింగిన కోడిపుంజు..

Sep 4 2017 7:03 AM | Updated on Sep 17 2017 6:20 PM

పామును మింగిన కోడిపుంజు..

పామును మింగిన కోడిపుంజు..

సాధారణంగా పామును చూస్తే కోళ్లు బెదిరిపోతాయి.

20 నిమిషాల పోరులో పుంజుదే విజయం
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్‌): సాధారణంగా పామును చూస్తే కోళ్లు బెదిరిపోతాయి. అరుస్తూ ఆమడదూరం పారిపోతాయి. కానీ ఓ కోడిపుంజు అమాంతం పామునే మింగేసింది. కుమ్రంభీం జిల్లా కెరమెరి మండలంలోని చిన్నసాకడ గ్రామంలో ఆదివారం ఈ విచిత్రం జరిగింది. ఊళ్లో ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలోని ఓ పొలంలో 20 నిమిషాల పాటు నాగుపాము, కోడిపుంజు పోట్లాడుకున్నాయి.

చాలాసార్లు పాము పడగ విప్పి బుస కొడుతుంటే కోడిపుంజు మాత్రం చాకచక్యంగా తప్పించుకుంది. చివరి పోరులో పోట్లాడి అలసిపోయిన పామును.. తన నోటితో పొడిచి పొడిచి చివరికి అమాంతంగా మింగేసింది. ఇది చూసిన ప్రజలు పామును మింగిని కోడిని మనిషి తింటే విషమెక్కదా? అని భయం భయంగా చర్చించుకున్నారు.     –కెరమెరి(ఆసిఫాబాద్‌)

Advertisement
 
Advertisement
Advertisement