రైల్లో మత్తుమందు ఇచ్చి దోపిడీ | Robbery in the train | Sakshi
Sakshi News home page

రైల్లో మత్తుమందు ఇచ్చి దోపిడీ

Jun 28 2017 2:52 AM | Updated on Aug 30 2018 5:27 PM

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు గుర్తుతెలియని వ్యక్తులు మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు.

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన
 
కాజీపేట: యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు గుర్తుతెలియని వ్యక్తులు మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కొంతమంది కూలీలు తమ ప్రాంతానికి వెళ్లేందుకు సోమవారం రాత్రి యశ్వంతా పూర్‌లో పాట్నా వెళ్లే రైలు ఎక్కారు. యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో ఎక్కిన వీరి వద్ద డబ్బులున్నట్లుగా దొంగలు గుర్తించారు.

రైలు కొద్దిదూరం ప్రయాణం చేసిన తర్వాత వీరితో కలసి ప్రయాణం చేస్తున్నట్టుగా నటించి వీరికి మాయమాటలు చెప్పి మామిడి రసం ప్యాకెట్లను అందించారు. సదరు కూలీలు ఆ జ్యూస్‌ తాగి నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత దొంగలు ఈ కూలీల వద్ద ఉన్న రూ.27 వేల నగదును అపహరించుకు వెళ్లారు. రైలు కర్నూల్‌కు వచ్చిన తర్వాత పక్కబోగీలో ఉన్న సహచర కూలీల్లో ఒకరు వచ్చి చూడగా బోగీలో పడిపోయి ఉన్నారు.  మంగళవారం రైలు కాజీపేటకు రాగానే బాధితులందరినీ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement