తలపై కొట్టి.. పుస్తెల తాడు అపహరణ | robbery gang attack on women in karimnagar distirict | Sakshi
Sakshi News home page

తలపై కొట్టి.. పుస్తెల తాడు అపహరణ

Aug 31 2015 10:14 AM | Updated on Sep 3 2017 8:29 AM

పాలు విక్రయించేందుకు వెళుతున్న ఓ మహిళపై దుండగులు దాడి చేసి ఆమె మెడలోని పుస్తెల తాడును అపహరించుకుపోయారు.

బసంత్‌నగర్: పాలు విక్రయించేందుకు వెళుతున్న ఓ మహిళపై దుండగులు దాడి చేసి ఆమె మెడలోని పుస్తెల తాడును అపహరించుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం లక్ష్మీపురం వద్ద చోటు చేసుకుంది. పాలకుర్తి గ్రామానికి చెందిన అట్ల గౌరమ్మ (60) సోమవారం ఉదయం పాలు విక్రయించేందుకు నడచి వెళుతోంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు లక్ష్మీపురం సమీపంలో గౌరమ్మ తలపై కర్రతో కొట్టారు.

వెంటనే ఆమె మెడలోని పుస్తెల తాడును తెంపుకుని పరారయ్యారు. గాయపడిన ఆమె రామగుండం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనంతరం 108 వాహనంలో పోలీసులు బాధితురాలిని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement