రెండు లారీలు ఢీ: ఒకరి మృతి | road accident at ghatkesar | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ: ఒకరి మృతి

Aug 6 2015 11:04 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘట్‌కేసర్: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కీసర నుంచి ఘట్‌కేసర్ వెళ్తున్న ఇటుక లారీ ఘట్‌కేసర్ నుంచి కీసర వస్తున్న మరో లారీని కొండాపూర్ గ్రామ సమీపంలో ఢీకొట్టింది. దీంతో ఇటుక లారీ డ్రైవర్ వెంకటయ్య(34) మృతిచెందాడు. కాగా మరోలారీ డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement