విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి | Right to Education to law enforcement | Sakshi
Sakshi News home page

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి

Jul 22 2015 12:07 AM | Updated on Jul 11 2019 5:01 PM

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి - Sakshi

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి

కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయలని టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలిగ లింగస్వామి కురుమ డిమాండ్ చేశారు...

టీజీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
కలెక్టరేట్:
కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయలని టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలిగ లింగస్వామి కురుమ డిమాండ్ చేశారు. మంగళవారం విద్యాహక్కు చట్టం అమలుపై తలపెట్టిన హైదరాబాద్ జిల్లా డీఈవో కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిజాం కళాశాల నుంచి ర్యాలీగా వెళ్లి డీఈవో కార్యాలయాన్ని ముట్టడించాలనుకున్న టీజీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాలిగ లింగస్వామి మాట్లాడుతూ... విద్యార్థుల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులనే విస్మరించడం బాధాకరమన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ పాఠశాలల్లో పటిష్టంగా విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలని, డీఎస్సీ ప్రకటన విడుదల చేయాలని, శాశ్వత డిప్యూటీ డీఈవో, ఎంఈవోలను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నక్క శ్రీశైలం యాదవ్, ఉపాధ్యక్షుడు ఎం. కృష్ణకాంత్, ఓయూ అధ్యక్షుడు గొడిగె వెంకన్న, అబిడ్స్ ఇన్‌చార్జ్ రాజేష్, ప్రవీణ్, కిరణ్, నవీన్ యాదవ్, వెంకన్న, రమేష్, నవీన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement