కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి: రేవంత్ | Revanth reddy slams KTR | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి: రేవంత్

Nov 13 2014 2:06 AM | Updated on Aug 10 2018 9:42 PM

కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి: రేవంత్ - Sakshi

కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి: రేవంత్

ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసిన ఆంగ్లో ఇండియన్‌లా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా..

లేకుంటే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం: రేవంత్
 సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసిన ఆంగ్లో ఇండియన్‌లా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి కె.తారక రామారావుపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ‘నిండు సభలో టీడీపీ సభ్యులను ఆంగ్లో ఇండియన్ అని అనడం ద్వారా కేటీఆర్ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్పీకర్ సభ్యులందరికీ సభాపతి. వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఆయన పై ఉంది’ అని చెప్పారు. కేటీఆర్‌కు అబద్ధాలు చెప్పడం సాధారణమై పోయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement