ప్రాణహాని ఉంది.. కేంద్ర భద్రత కల్పించాలి 

Revanth Reddy knocks High Court door for security - Sakshi

హైకోర్టులో రేవంత్‌ రిట్‌ దాఖలు 

సాక్షి, హైదరాబాద్‌: తన ప్రాణాలకు ముప్పు ఉందని, 4ప్లస్‌4 గన్‌మెన్‌లతోపాటు ఎస్కార్ట్‌ కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆ శ్రయించారు. తనకు వ్యక్తిగత, రాజకీయ వ్యతిరేకులుగా ఉన్న వారు సీఎం, మంత్రులు వంటి పద వులను అధిష్టించారని, సీఎంకు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు నుంచీ ప్రాణహాని ఉందని పిటిషన్‌లో ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో తనకు 3ప్లస్‌3 భద్రత ఉండేదని, దీనిని 2ప్లస్‌2కు తగ్గించారని, 2018 ఎన్నికల సమయంలో హైకోర్టు ఆదేశాల మేరకు 4ప్లస్‌4కు పెంచినా తర్వాత తగ్గించారని తెలిపారు.

తనకు కేంద్ర ప్రభుత్వ భద్రత కల్పించాల ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు గతేడాది ఆగస్టు 28న చేసుకున్న దరఖాస్తు పరిశీలనలో ఉన్నట్లుగా తనకు  జవాబు వచ్చిందని,దాన్ని ఆమోదించి తనకు భద్రత కల్పించేలా  ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హైటెక్‌ సిటీ సమీపంలో రూ.కోట్ల విలువైన భూములను చట్ట వ్యతిరేకంగా జూపల్లి రామేశ్వరరావుకు ధారాదత్తం చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ‘పిల్‌’ వేశానని తెలిపారు.  కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, జూపల్లి రామేశ్వరరావులను ప్రతివాదులుగా చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top