జైల్‌ భరో నిర్వహిస్తాం: రేణుకా చౌదరి | renuka chowdary fires on mirchi yard issue | Sakshi
Sakshi News home page

జైల్‌ భరో నిర్వహిస్తాం: రేణుకా చౌదరి

Jun 6 2017 1:38 PM | Updated on Sep 5 2017 12:57 PM

ఖమ్మం జిల్లా ముదిగొండలో కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకా చౌదరి మంగళవారం పర్యటించారు.

ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండలో కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకా చౌదరి మంగళవారం పర్యటించారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌పై దాడి ఘటనలో అరెస్టు అయిన చిరుమర్రికి చెందిన రైతు ఆనందరావు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దమ్ముంటే తన చేతికి బేడీలు వేయాలని సవాల్‌ విసిరారు. రైతులపై కండిషన్‌ బెయిల్‌ ఎత్తివేయకపోతే జైల్‌ భరోకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కాగా,  రైతు ఆనందరావును కలిసి రేణుకాచౌదరి రూ.15 వేల సహాయం అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement