చదువు సమాజానికి ఉపయోగపడాలి | Sakshi
Sakshi News home page

చదువు సమాజానికి ఉపయోగపడాలి

Published Thu, Oct 16 2014 3:00 AM

Read useful to society

బొల్లికుంట(సంగెం) : విద్యార్ధుల చదువు సామాజానికి ఉపయోగపడేలా ఉండాలని ప్రముఖ సామాజిక, జానపద ఉద్యమగాయకుడు గోరెటి వెంకన్న కోరారు. మండలంలోని బొల్లికుంటలోగల వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన 5వ జాతీయస్థాయి టెక్నో కల్చరల్ ఫెస్ట్ వాగ్ తరంగ్ 2కే-14 ముగింపు కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది.

ముఖ్యఅతిధిగా హాజరైన గోరటి వెంకన్న మాట్లాడుతూ  ప్రపంచదేశాలన్నింటికీ మన భారతదేశం, తెలంగా ణ మేధోసంపత్తిని అందిస్తున్నదన్నా రు. అనంతరం ఆయన తన పాటలు, నృత్యా ల ద్వారా ఆకట్టుకున్నారు.

 కాగా, వర్ధమాన సినీగాయకులు రెని నారెడ్డి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సోదరుడు సాగర్ ఆలపించిన గీతాలు ఉర్రూతలూగించాయి. కళాశాల కార్యద ర్శి దేవేందర్‌రెడ్డి, ఏఓ సత్యపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ సత్తయ్య, ప్రకాశ్, డెరైక్టర్ భా స్కర్‌రావుతో పాటు రాజారావు, నాగరా జు, శ్రావణ్‌రెడ్డి, సురేష్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement