వైభవంగా రామయ్యకు పర్యంకోత్సవం | Ramaiah exposition paryankotsavam | Sakshi
Sakshi News home page

వైభవంగా రామయ్యకు పర్యంకోత్సవం

Apr 13 2015 1:40 AM | Updated on Nov 6 2018 6:01 PM

వైభవంగా రామయ్యకు పర్యంకోత్సవం - Sakshi

వైభవంగా రామయ్యకు పర్యంకోత్సవం

భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి పర్యంకోత్సవం(16 రోజుల పండుగ) ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది.

భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి పర్యంకోత్సవం(16 రోజుల పండుగ) ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారి కల్యాణం తర్వాత పదహారో రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎడబాటు ఉత్సవం అని కూడా పేరు. పర్యంకోత్సవంలో భాగంగా స్వామి వారికి అభిషేకం జరిపించారు. ఉత్సవ పెరుమాళ్లను బేడా మండపం పైకి తీసుకొచ్చి నూతన పర్యంకోత్సవ కర్మాంగ స్నపనం చేశారు.  ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన గావించారు. పుణ్య జలాలను స్వామి వారి మూలవరుల వద్దకు తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. వారితో బేడామండపంలోని ఉత్సవ పెరుమాళ్లకు అభిషేకం జరిపించారు. యాగశాలలో హోమం నిర్వహించారు. రాత్రికి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై తిరువీధి సేవ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement