సూర్యాపేటలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ | Railway Reservation Counter in suryapet | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్

Oct 7 2014 1:03 AM | Updated on Sep 2 2017 2:26 PM

రైల్వే ప్రయాణికుల కల ఫలించింది. సూర్యాపేట పట్టణానికి రైల్వే లైన్ లేనప్పటికీ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మాత్రం మంజూరైంది. రైలు ప్రయా ణం చేయాలనుకునే సూర్యాపేట ప్రాంత ప్రజలు నల్లగొండ,

 సూర్యాపేట :రైల్వే ప్రయాణికుల కల ఫలించింది. సూర్యాపేట పట్టణానికి రైల్వే లైన్ లేనప్పటికీ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మాత్రం మంజూరైంది. రైలు ప్రయా ణం చేయాలనుకునే సూర్యాపేట ప్రాంత ప్రజలు నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లి రిజర్వేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పట్టణంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని పలు అసోసియేషన్లు, యూనియన్లు, బ్యాంకులు, కళాశాలలు సుమారు 300లకుపైగా విజ్ఞాపన పత్రాలు సమర్పించాయి. దీంతో పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్‌లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 8న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభించనున్నట్టు భారతీయ జనతా పార్టీ మీడియా టౌన్ కన్వీనర్ మంచాల రంగయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement