ప్రస్తుత పార్లమెంట్‌ సెషన్స్‌లోనే బీసీ బిల్లు | r krishnaiah about bc bill | Sakshi
Sakshi News home page

ప్రస్తుత పార్లమెంట్‌ సెషన్స్‌లోనే బీసీ బిల్లు

Dec 19 2017 3:09 AM | Updated on Dec 19 2017 3:11 AM

r krishnaiah about bc bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టా లని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బంద్‌లు, రాస్తారోకోలు, మిలిటెంట్‌ పోరాటాలు చేస్తామన్నారు.

బీసీ భవన్‌లో సోమవారం జరిగిన సంఘం విస్తృత స్థాయి సమావేశంలో  మాట్లాడుతూ పార్లమెంట్‌లో 36 రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్నా ఒక్కటి కూడా బీసీల పక్షాన మాట్లాడట్లేదని విమర్శించారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్‌రావు మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement