వర్మ ప్రెస్‌మీట్‌ నిరాకరణపై నోటీసులు

 Press Council notices to CS  police officials  - Sakshi

సీఎస్, డీజీపీ, విజయవాడ కమిషనర్, ఐలాపురం, నోవాటెల్‌లకు తాఖీదులు

2 వారాల్లోగా నోటీసులకు సమాధానమివ్వాలని పీసీఐ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను మీడియా సమావేశం ని ర్వహించకుండా అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమి షనర్, విజయవాడలోని ఐలాపురం, నోవాటెల్‌ హోటళ్ల జనరల్‌ మేనేజర్లకు భారత ప్రెస్‌కౌన్సి ల్‌ (పీసీఐ) నోటీసులు జారీ చేసింది. 15 రోజు ల్లోగా దీనిపై రాతపూర్వక సమాధానమివ్వాల ని పీసీఐ కార్యదర్శి అనుపమా భట్నాటర్‌ ఆదేశించారు. గత నెల 26న విజయవాడలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రదర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి తదితరులను మీడియా సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవడంపై ఇండియన్‌ జర్నలిస్టుల యూనియన్‌ (ఐజే యూ) సీనియర్‌ నాయకుడు, పీసీఐ మాజీ సభ్యుడు కె.అమర్‌నాథ్‌ పీసీఐకి ఫిర్యాదు చేశారు.

పీసీఐ చైర్మన్‌ జస్టిస్‌ సీకే ప్రసాద్‌ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు కార్య దర్శి అనుపమా తెలియజేశారన్నారు. ఇది భా వప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్పించడంతో పాటు ముందుస్తు సెన్సార్‌ షిప్‌ (ప్రీ సెన్సార్‌ షిప్‌) విధించినట్టుగా భావించాల్సి ఉంటుంద ని నోటీసుల్లో పీసీఐ పేర్కొన్నట్లు అమర్‌నాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు బయోపిక్‌ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాతలు మీడియా సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార పార్టీ, పోలీసుల ఒత్తిళ్ల కారణంగానే మీడియా సమావేశం నిర్వహించేందుకు హాలు బుక్‌ చేయడానికి కూడా రెండు హోటళ్లు నిరాకరించాయని అమర్‌నాథ్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top