మరుగుదొడ్లు నిర్మించుకోవడం లేదని.. | Power Conncetions Cut inToilets Rejections Houses | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్లు నిర్మించుకోవడం లేదని..

Apr 13 2018 12:58 PM | Updated on Oct 8 2018 5:07 PM

Power Conncetions Cut inToilets Rejections Houses - Sakshi

కరెంట్‌ కనెక్షన్లను తొలగిస్తున్న విద్యుత్‌ సిబ్బంది

అడ్డాకుల (దేవరకద్ర): మండలంలోని గుడిబండలో గురువారం అధికారులు పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఎంపీడీఓ బి.నర్సింగ్‌రావు, స్థానిక సర్పంచ్‌ రంగారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి యశోద, అంగన్‌వాడీ, ఆశలు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ నిర్మాణాలు మొదలుపెట్టని వారిని కలిశారు. నిర్మాణాలు మొదలు పెట్టి మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీడీఓ సూచించారు.

నిర్మాణాలు మొదలు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ల ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. మొండికేసిన వారి ఇళ్లకు విద్యుత్‌ శాఖ సిబ్బందితో కరెంటు కనెక్షన్లను తొలగింపజేశారు. నిర్మాణాలు పూర్తిచేసిన 5 మంది లబ్ధిదారులకు పంచాయతీ కార్యాలయం వద్ద చెక్కులను అందజేశారు. మూడు రోజుల్లో గ్రామంలో నిర్మాణాలు పూర్తి కావాలని ఎంపీడీఓ బి.నర్సింగ్‌రావు సూచించారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement