పొన్నం ఫిర్యాదుపై విచారణ 28కి వాయిదా | postponed trial to April 28 on ponnam prabhakar claim | Sakshi
Sakshi News home page

పొన్నం ఫిర్యాదుపై విచారణ 28కి వాయిదా

Mar 31 2015 2:03 AM | Updated on Sep 2 2017 11:36 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ ఏప్రిల్ 28కి వాయిదా పడింది.

సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ ఏప్రిల్ 28కి వాయిదా పడింది. విచారణలో భాగంగా పొన్నం, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ సోమవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి ఎదుట హాజరయ్యా రు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నిధులకు సంబంధించిన అంశం తమ పరిధిలోకి రాదని, సంక్షేమ విభాగాలు పర్యవేక్షిస్తాయని రామకృష్ణ నివేదించారు.

ఈ మేరకు స్పందించిన లోకాయుక్త... నివేదిక సమర్పించాలని సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేశారు.మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావులు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ముడుపులు స్వీకరించారని, వీరిపై  చర్యలు చేపట్టాలని కోరుతూ పొన్నం ప్రభాకర్ లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement