‘కోడెల పోస్టుమార్టం నివేదిక అందలేదు’

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించిన కేసులో పోస్టుమార్టం నివేదిక ఇంకా అందలేదని బంజారాహిల్స్ ఏసీపీ, ఈ కేసు విచారణ అధికారి కేఎస్ రావు తెలిపారు. గత సెప్టెంబర్ 16వ తేదీన కోడెల హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోడెల కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటికే విచారించి ఆయన సెల్‌ఫోన్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతి చెందిన రోజు ఘటనా స్థలంలో సేకరించిన కొన్ని వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని కేఎస్ రావు తెలిపారు. దీనిపై నివేదిక వచ్చాక ఈ కేసులో పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి