36 మంది డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌లు | postings for 36 deputy collectors | Sakshi
Sakshi News home page

36 మంది డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌లు

Mar 21 2017 3:26 AM | Updated on Sep 5 2017 6:36 AM

ఎంతో కాలంగా పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న 36 మంది డిప్యూటీ కలెక్టర్లకు ఎట్టకేలకు పోస్టింగ్‌ లభించింది.

సాక్షి, హైదరాబాద్‌: ఎంతో కాలంగా పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న 36 మంది డిప్యూటీ కలెక్టర్లకు ఎట్టకేలకు పోస్టింగ్‌ లభించింది. రెవెన్యూశాఖతో పాటు పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, క్రీడలు, గిరిజన, వికలాంగుల, మైనార్టీ సంక్షేమం.. తదితర శాఖలలో ఖాళీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్‌ హోదా పోస్టుల్లో వారిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, బదిలీ అయిన ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లను తదుపరి పోస్టింగ్‌ల నిమిత్తం ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్‌మీనా ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement