'సెంటిమెంట్తో టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెడుతోంది' | Ponnala Lakshmaiah takes on TRS Party | Sakshi
Sakshi News home page

'సెంటిమెంట్తో టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెడుతోంది'

Sep 27 2014 12:17 PM | Updated on Aug 11 2018 7:41 PM

ప్రాంతీయ సెంటిమెంట్తో టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.

హైదరాబాద్: ప్రాంతీయ సెంటిమెంట్తో టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.  ప్రాంతీయ సెంటిమెంటే టీఆర్ఎస్ పార్టీ ఆయుధమని ఆయన అభివర్ణించారు. శనివారం గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పొన్నాల ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ... ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఒక్కటే జాతీయ దృక్పథంతో దేశవ్యాప్తంగా పని చేస్తుందని పోన్నాల లక్ష్మయ్య తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ మొదటి సభ్యత్వం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపై ఉంటే పార్టీ బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. సభ్యత్వ నమోదును పార్టీ కేడర్ పారదర్శకంగా నిర్వహించాలని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement