'కేబినెట్లో సగంమంది తెలంగాణ వ్యతిరేకులే' | ponnala lakshmaiah, danam nagendar slams kcr government | Sakshi
Sakshi News home page

'కేబినెట్లో సగంమంది తెలంగాణ వ్యతిరేకులే'

Feb 20 2015 1:54 PM | Updated on Aug 15 2018 9:27 PM

'కేబినెట్లో సగంమంది తెలంగాణ వ్యతిరేకులే' - Sakshi

'కేబినెట్లో సగంమంది తెలంగాణ వ్యతిరేకులే'

మీడియాకు కూడా సంకెళ్లు వేస్తూ కేసీఆర్ నియంతాల వ్యవహరిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : మీడియాకు కూడా సంకెళ్లు వేస్తూ కేసీఆర్ నియంతాల వ్యవహరిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి కోట్లు దండుకున్న కేసీఆర్...ఇప్పుడు సెటిలర్స్ బాట పట్టారని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. మాట మార్చే నేత, మూఢ నమ్మకాల సీఎం అని ప్రజలే నిరసన తెలుపుతున్నారని పొన్నాల మండిపడ్డారు. నేతలకు వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా... కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అందరూ కలిసి చేసుకుందామని ఆయన ఈ సందర్భంగా సొంతపార్టీ నేతలకు సూచించారు.

మాజీ మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే కేసీఆర్ సెటిలర్స్ వద్దకు వెళుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కేబినెట్లో సగంమంది తెలంగాణ వ్యతిరేకులేనని  దానం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ క్యాడర్ను వేధిస్తే పోలీస్ స్టేషన్లను కూడా ముట్టడిస్తామని దానం హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు టీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement