భళా.. పోలీస్‌ | Police Save Man Life From Suicide Attempt in Hyderabad | Sakshi
Sakshi News home page

భళా.. పోలీస్‌

Nov 3 2018 9:23 AM | Updated on Nov 3 2018 9:23 AM

Police Save Man Life From Suicide Attempt in Hyderabad - Sakshi

వినోద్‌కుమార్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న పోలీసు కానిస్టేబుల్‌

దుండిగల్‌: ఆత్మహత్యకు యత్నించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తరలించి సురక్షితంగా కాపాడి పోలీసులు శభాష్‌ అనిపించుకున్నారు.. వివరాల్లోకి వెళితే.. మెదక్‌జిల్లా, మేడికొండ తాండా కు చెందిన వినోద్‌కుమార్‌ దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిసరాల్లో ఉంటూ ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన వినోద్‌కుమార్‌ శుక్రవారం భార్యతో గొడవ పడి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. దీంతో అతని భార్య స్థానికులను అప్రమత్తం చేయడంతో వినోద్‌కుమార్‌ను కిందకు దింపారు.

అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి చేరుకోగా, స్థానికులు దుండిగల్‌ పెట్రోలింగ్‌ వాహనానికి సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటయ్యగౌడ్, డ్రైవర్‌ కృష్ణారెడ్డి అతడిని పై అంతస్తు నుంచి భుజాలపై కిందకు తీసుకు వచ్చి సూరారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వినోద్‌కుమార్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించి బాధితుడిని ఆస్పత్రికి రక్షించిన పోలీసులను స్థానికులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement