వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో ఏడుగురు బాలకార్మికులకు మిల్స్‌కాలనీ పోలీసులు మంగళవారం విముక్తి కల్పించారు.
వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో ఏడుగురు బాలకార్మికులకు మిల్స్‌కాలనీ పోలీసులు మంగళవారం విముక్తి కల్పించారు. వీరిని చైల్డ్‌లైన్ సెంటర్‌కు తరలించారు. వరంగల్ సబ్‌డివిజన్ పరిధిలో దుకాణాలు, కార్ఖానాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను పోలీసులు విడిపించారు. బాలలను షాపుల్లో పనిలోకి తీసుకోవడం చట్టవ్యతిరేకమని, అలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


