‘రెండు నెలల అదనపు వేతనం ఇవ్వండి’  | Police Officers Association Demands For Two Month Additional Salary | Sakshi
Sakshi News home page

Oct 11 2018 2:38 AM | Updated on Oct 11 2018 2:38 AM

Police Officers Association Demands For Two Month Additional Salary - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబాలకు దూరం గా ఉంటూ ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి 2 నెలల అదనపు వేతనం చెల్లించాలని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి నేతృత్వంలోని బృందం బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిలను కలసి వినతిపత్రం సమర్పించింది. పోలీసులకు ఆన్‌లైన్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించటం తో పాటు ఎస్‌ఐ ర్యాంకు అధికారులను జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో సైబరాబాద్‌ అధ్యక్షుడు భద్రారెడ్డి, నిజామాబాద్‌ అధ్యక్షుడు షకీల్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement