నల్లగొండ జిల్లాలో మరోసారి హై అలర్ట్ ప్రకటించారు. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలీసులే లక్ష్యంగా
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మరోసారి హై అలర్ట్ ప్రకటించారు. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలీసులే లక్ష్యంగా దాడులు జరగొచ్చనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులను ఉగ్రవాదులు టార్గెట్ చేయటంతో పాటు, జిల్లాలోని పోలీస్ స్టేషన్లపై దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభిస్తున్నారు. మరోవైపు జిల్లా పోలీసులకు సెలవులు రద్దు చేశారు.