పోలీసులకు తప్పిన ప్రమాదం | police escaped accident | Sakshi
Sakshi News home page

పోలీసులకు తప్పిన ప్రమాదం

Mar 3 2015 10:58 PM | Updated on Apr 3 2019 7:53 PM

రోడ్డు పక్కన నిలిపి ఉన్న పోలీసు జీపును వేగంగా వచ్చిన ఓ టిప్పర్ అదుపుతప్పి ఢీ కొట్టింది.

హైదరాబాద్: రోడ్డు పక్కన నిలిపి ఉన్న పోలీసు జీపును వేగంగా వచ్చిన ఓ టిప్పర్ అదుపుతప్పి ఢీ కొట్టింది. అయితే, ఆ సమయంలో పోలీసులు జీపులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హయత్‌నగర్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మంగళవారం ఉదయం సిబ్బందితో గస్తీ విధుల్లో ఉన్నారు.

 

కుంట్లూరు చౌరస్తా వద్ద రోడ్డు పక్కన జీపును నిలిపి, అక్కడి బారికేడ్లను సరిచేస్తున్న సమయంలో... వేగంగా వచ్చిన టిప్పర్ జీపును ఢీ కొట్టింది. దీంతో జీపు నుజ్జనుజ్జయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement