జడ్చర్లలో పోలీసుల దాడులు | police checks in mahabubnagar district | Sakshi
Sakshi News home page

జడ్చర్లలో పోలీసుల దాడులు

Jan 27 2016 1:26 PM | Updated on Aug 21 2018 6:12 PM

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ సమీపంలోని పారిశ్రామిక వాడలో పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నారు.

జడ్చర్ల టౌన్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ సమీపంలోని పారిశ్రామిక వాడలో పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు బుధవారం ఉదయం దాడులు చేసిన పోలీసులు 10 టన్నుల బరువున్న 80 దుంగలను సీజ్ చేశారు. అయితే, అవి ఎర్రచందనం దుంగలా? లేక టేకు కలపా అనేది నిర్ధారణ కాలేదు. ఇందుకోసం వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించాకనే ఏమిటనేది నిర్ధారణ అవుతుందని చెబుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement