జాతీయ స్థాయిలో పోలవరం ఉద్యమం | Polavaram movement at the national level | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో పోలవరం ఉద్యమం

Jun 2 2014 12:25 AM | Updated on Aug 21 2018 8:34 PM

జాతీయ స్థాయిలో పోలవరం ఉద్యమం - Sakshi

జాతీయ స్థాయిలో పోలవరం ఉద్యమం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో ఉద్యవుం చేపడతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

ముంపుప్రాంతాలపై టీ-టీడీపీ వైఖరి వెల్లడించాలి: తమ్మినేని

భద్రాచలం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో ఉద్యవుం చేపడతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముంపు మండలాల బదలాయింపు ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్షకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ఇంత హడావిడిగా ముంపు మండలాల బదలాయింపుపై ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.  ముంపు ప్రాంతాలపై తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement