ఫొటోగ్రాఫర్ దారుణ హత్య | photographer murderd in kurnool district | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫర్ దారుణ హత్య

Apr 20 2015 7:44 AM | Updated on Jul 30 2018 8:29 PM

ఫొటోగ్రాఫర్ దారుణ హత్య - Sakshi

ఫొటోగ్రాఫర్ దారుణ హత్య

వ్యక్తి గత కారణాలతో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు.

కర్నూలు: వ్యక్తి గత కారణాలతో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో జరిగింది. వివరాలు..నూనెపల్లికి చెందిన గౌస్(30) నంద్యాల పట్టణంలోని ఫోటోగ్రాఫర్స్ ఆసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. కాగా, సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంజుమన్ వీధిలో ఉన్న ఉస్సేన్‌బాషా ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉస్సేన్‌బాషాకు, గౌస్‌కు మధ్య జరిగిన గొడవ జరిగింది. ఈ గొడవలో బాషా కత్తితో గౌస్‌ను హతమార్చాడు. అయితే, ఈ హత్యకు గత కారణాలు పూర్తిగా తెలియాల్సిఉంది.

విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం బాషాను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement