మహిళలు పెప్పర్‌ స్ప్రే తెచ్చుకోవచ్చు 

Pepper Spray Will Be Allowed In Metro Trains By Women In Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెట్రోలో ప్రయాణించే మహిళలు ఆత్మరక్షణ కోసం తమ వెంట పెప్పర్‌ స్ప్రే తెచ్చుకునే వెసులుబాటును హైదరాబాద్‌ మెట్రో కల్పిస్తోంది. బెంగళూరు మెట్రోలో అమలులో ఉన్న ఈ విధానాన్ని హైదరాబాద్‌ మెట్రోలో పరిచయం చేస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే మెట్రోలో భద్రతా కార్యకలాపాలు పర్యవేక్షించే అధికా రులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. దిశ హత్యాచారం తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top