ముఖ్యమంత్రికే మద్దతు ధర లేదు: కోదండరెడ్డి | PCC Kisan Cell President kodandareddy comments on CM KCR | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికే మద్దతు ధర లేదు: కోదండరెడ్డి

Mar 4 2016 9:51 PM | Updated on Oct 1 2018 2:00 PM

స్వయంగా తాను సాగుచేసిన పంటకు మద్దతు ధర లేదని సీఎం కేసీఆర్ దిగాలు చెందితే సామాన్య రైతుల పరిస్థితి ఏమిటని పీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి ప్రశ్నించారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ (మెదక్): స్వయంగా తాను సాగుచేసిన పంటకు మద్దతు ధర లేదని సీఎం కేసీఆర్ దిగాలు చెందితే సామాన్య రైతుల పరిస్థితి ఏమిటని పీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల గడువు దగ్గర పడుతున్నందున రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మెదక్ జిల్లా సంగారెడ్డిలో డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కోదండరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

రాష్ర్టంలో 23 వేల కోట్ల వ్యవసాయ రుణాలుంటే ప్రభుత్వం మాత్రం రూ.17 వేల కోట్లు మాత్రమే ఉన్నట్టు చెప్పడం సరికాదన్నారు. ఇవేకాకుండా మరో 3.50 లక్షల మంది మహిళా రైతుల పుస్తెల తాళ్లు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారన్నారు. బ్యాంకర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగానే తాము ఈ వివరాలను వెల్లడిస్తున్నామన్నారు. అనేక ప్రాజెక్టులకు నిధులిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రైతులకు మొండిచేయి చూపిస్తున్నాయని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement