పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీజ కోలుకుంది.. | Pawan kalyan fan srija beats cancer | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీజ కోలుకుంది..

Dec 1 2014 8:25 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీజ కోలుకుంది.. - Sakshi

పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీజ కోలుకుంది..

అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన శ్రీజ కోలుకుందని వైద్యులు తెలిపారు.

ఖమ్మం: అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన శ్రీజ కోలుకుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్ కేర్ నుంచి బయటకు వచ్చిందని డాక్టర్ అసాధారణ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. పాల్వంచకు చెందిన శ్రీజ అక్టోబర్ 2న బ్రెయిన్ ఫీవర్‌తో కోమాలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

అనారోగ్యంతో ఉన్న ఆమె అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌ను చూడాలనుందని తండ్రి నాగయ్యకు చెప్పింది. శ్రీజ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. తన కూతురికి పవన్‌ను చూడాలని ఉందని, చిన్నారి తండ్రి మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి పవన్ స్పందించారు.

అక్టోబర్ 17న ఖమ్మం వచ్చి శ్రీజను చూశారు. కోలుకున్నాక మరోసారి వచ్చి చూస్తానన్నారు. కాగా, ప్రస్తుతం శ్రీజ కోలుకుంది. తన బిడ్డకు మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లకు, పవన్‌కు శ్రీజ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement