ఆస్పత్రిలో రోగి మృతి : బంధువుల ఆందోళన | Patient dies, relatives stage dharna in front of hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో రోగి మృతి : బంధువుల ఆందోళన

Sep 8 2015 3:07 PM | Updated on Aug 29 2018 4:16 PM

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ ప్రాణాలొదిలింది. దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

నల్లగొండ : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ ప్రాణాలొదిలింది. దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మునుగోడు మండల కేంద్రానికి చెందిన జయమ్మ(30) సోమవారం రాత్రి  కడుపునొప్పితో నల్లగొండలోని సురక్ష ఆస్పత్రిలో చేరింది.

కాగా అక్కడ చికిత్స తీసుకుంటూ మంగళవారం ఉదయం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాధితురాలు మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు మోహరించాయి.

Advertisement
 
Advertisement
Advertisement