తెలంగాణ పోలీస్‌కు ‘వెరీఫాస్ట్’ అవార్డు

సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తిచేస్తున్నందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు వరుసగా మూడోసారి ‘ది బెస్ట్ వెరిఫికేషన్’ అవార్డును అందిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. 2017–18 ఏడాదికి పోలీస్ శాఖకు ఈ అవార్డు దక్కినట్టు తెలిపింది.
గతంలో హైదరాబాద్ సిటీ పోలీస్‌కు రెండు సార్లు ఈ అవార్డు దక్కింది. నెలల సమయం తీసుకునే పోలీస్ వెరిఫికేషన్‌ను ‘వెరీఫాస్ట్’అనే సాఫ్ట్‌వేర్ ద్వారా కేవలం నాలుగు రోజుల్లోనే తీసుకువస్తున్నారు. ఈ అవార్డు దక్కడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం పాస్‌పోర్టు సేవాదివస్ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ అవార్డు అందుకుంటారని పోలీస్ శాఖ తెలిపింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి