కరీంనగర్‌లో పాస్‌పోర్ట్ మేళా | passport mela in karimnagar on may 16th and 17th | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో పాస్‌పోర్ట్ మేళా

May 12 2015 5:08 PM | Updated on Oct 16 2018 2:49 PM

ఈనెల 16వ తేదీన కరీంనగర్‌లో ఉన్న పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవా క్యాంపు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్లో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ : ఈనెల 16వ తేదీన కరీంనగర్‌లో ఉన్న పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవా క్యాంపు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్లో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16, 17 తేదీలలో రెండు రోజుల పాటు క్యాంపు ఉంటుందని, రోజుకు 200 స్లాట్స్ చొప్పున రెండు రోజులకు 400 మంది దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి ఆన్‌లైన్ స్లాట్‌లు నమోదు చేసుకోవచ్చునన్నారు. కేవలం సాధారణ పాస్‌పోర్ట్‌లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, తత్కాల్ పాస్‌పోర్ట్‌లకు అవకాశం లేదని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement