ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు | passengers tension for fumes in intercity express | Sakshi
Sakshi News home page

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

May 3 2015 12:09 AM | Updated on Apr 7 2019 3:24 PM

కాచిగూడ నుంచి అకోలకు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు రావడంతో ప్రయూణికులు భయూందోళనకు గురయ్యారు.

నిజామాబాద్: కాచిగూడ నుంచి అకోలకు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు రావడంతో ప్రయూణికులు భయూందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం 11 గంటలకు రైలు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే బోగీల చక్రాల వద్ద నుంచి పొగలు వెలువడ్డాయి. దీంతో ప్రయూణికులు కంగారుపడ్డారు.

 

వెంటనే రైల్వే సాంకేతిక విభాగం అధికారులు అప్రమత్తమై మరమ్మతులు చేపట్టారు. బ్రేక్ బైండింగ్ వల్లనే పొగలు వచ్చినట్టు వారు చెప్పారు. ఈ కారణంగా నిజామాబాద్‌లోనే రైలు దాదాపు 45 నిమిషాలు నిలిచిపోయిందని స్టేషన్ మాస్టర్ టి.ప్రభుచరణ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement