రైతు సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

Palla Rajeshwar Reddy Appointed as President of Rythu Samanvaya Samithi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సమన్వయ సమితిలో సభ్యులను త్వరలో నియమిస్తామని సీఎం తెలిపారు. క్యాబినెట్‌ హోదా కలిగిన ఈ పదవికి మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్‌గా నియమితులవడంతో ఆయన స్థానంలో పల్లాను ముఖ్యమంత్రి నియమించారు. మరోవైపు రైతు సంబంధ అంశాలపై మూడు, నాలుగు రోజులలో వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top