ఆ నలుగురు పిల్లలకు అండగా ఉంటాం | Sakshi
Sakshi News home page

ఆ నలుగురు పిల్లలకు అండగా ఉంటాం

Published Wed, Apr 15 2020 11:44 AM

Padma Rao Goud Visit Orphan Child Home in Secunderabad - Sakshi

సికింద్రాబాద్‌: అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథలుగా మారిన నలుగురు పిల్లలకు అండగా ఉంటామని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ హామీ ఇచ్చారు. సీతాఫల్‌మండి డివిజన్‌ బీదలబస్తీకి చెందిన రాధ అనే మహిళ భర్త కొద్ది నెలల క్రితమే మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో రాధ కూడా మృతి చెందింది. కూలీనాలీ చేసుకుని బతికే రాధకు నలుగురు సంతానం. ముగ్గురు బాలురు, ఒక బాలిక ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు పిల్లలు ప్రస్తుతం అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. మంగళవారం రాధ పిల్లలను పరామర్శించిన పద్మారావుగౌడ్‌ వారికి నెలకు సరిపడా రేషన్‌ సరకులు అందించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.10 వేల సహాయాన్ని అందించారు. పిల్లలకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెవెన్యూ అధికారులను పద్మారావుగౌడ్‌ ఆదేశించామన్నారు. నలుగురు పిల్లలకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్యాబోధనలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement