2019 మంది తల్లులకు పాదపూజ 

Padha Puja For 2019 Mothers - Sakshi

గోదావరిఖని(రామగుండం): అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం 2019 మంది మాతృమూర్తులకు పాదపూజ చేశారు. కోరుకంటి విజయమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్దసంఖ్యలో మాతృమూర్తులు హాజరయ్యారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తన తల్లి పాదాలను కడిగి ఆశీర్వాదం అందుకున్నారు.

రామగుండం నియోజకవర్గంలోని 2019 మంది తల్లులకు వారి పిల్లలు పాదాభిషేకం నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్దగా ఈ తరహా కార్యక్రమం నిర్వహించిన విజయమ్మ ఫౌండేషన్‌కు వండర్‌బుక్‌ రికార్డును సంస్థ ప్రతినిధులు బింగి నరేందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేతుల మీదుగా అందజేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top